రామకుప్పం మండలం పంద్యాలమడుగు పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భారత్ పాల్గొన్నారు. పంచాయతీలో గడపగడపకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం, సమస్యలను దగ్గరుండి వెంటనే పరిష్కరించడం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేసి అందరికీ అందుతున్నాయా లేదా అని ప్రజాభిప్రాయం తెలుసుకొన్నారు. ఎదైనా సమస్యలు ఉంటే వినతి పత్రం ద్వారా తీసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జడ్పిటీసీ నితిన్ రాఘవ్ రెడ్డి, మండల కన్వీనర్ బాబు రెడ్డి, ఎంపీపీ సుబ్రహ్మణ్యం, కో కన్వీనర్ చంద్రారెడ్డి, ప్రచార కార్యదర్శి కేశవరెడ్డి, సర్పంచ్ శ్వేతా రాంబాబు, ఎంపీటీసీ నాగభూషణం మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని శాఖలకు సంబంధించిన డైరెక్టర్లు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు వైఎస్ఆర్ సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.