నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం ఎస్ బి ఆర్ పురం గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనంను మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం సచివాలయంలోని వార్డు వాలంటరీ తో అర్హులైన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వారికి చేరే విధంగా ప్రతి గ్రామ వాలంటీర్లు పని చేయాలని కోరారు. అంతకు మునుపు గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి రోజాకు గ్రామ సచివాలయం లోని వార్డు మహిళా వాలంటీర్లు పూలతో ఘనస్వాగతం పలికారు.