తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం లోని నాగంపల్లి లో సెల్ టవర్ ఏర్పాటు కోసం వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈఓపిఆర్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుకుమార్ ఓ ప్రైవేటు కంపెనీ సెల్ టవర్ ఏర్పాటు గ్రౌండ్ రిపోర్ట్ కోసం గ్రామానికి వెళ్లారు. గ్రామంలో టవర్ ఏర్పాటు చేస్తే రేడియేషన్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చేసేదేమీ లేక అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.