రాష్ట్రంలో జిల్లాల విభజన సందర్భంగా క్రొత్త జిల్లాలలో ఆయన పేరు తో జిల్లా ఏర్పాటు చెయ్యాలని సదరు స్థానికులు వాపోయినా సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్ళితే... ఎస్సీ కులానికి సంబంధించిన ఎంతో మంది కోనసీమ జిల్లాకి రాజ్యాంగ నిర్మాత డా'' బి. ఆర్ . అంబేద్కర్ పేరు పెట్టాలని ధర్నాలు, నిరసనలు తెలియచేసింది. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప‍్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును మార్చింది. జిల్లాను పేరును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతున్నట్టు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. దీని కోసం కృషి చేసిన నాయకులూ ముఖ్యంగా మహాసేన అధ్యక్షులు సరిపళ్ళ రాజేష్ ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసారు.