చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నుంచి మూడు రోజుల పాటు పర్యటిస్తారని జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తారన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.