పాఠశాల సెలవుల్లో విద్యార్థినీ, విద్యార్థులకు గ్రంథాలయంలో నిర్వహించే పఠనముల బోధనల్లో హాజరై మరింత విజ్ఞానవంతులు అవ్వాలని కురబలకోట గ్రంథాలయాధికారి బి. చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుండి జూన్ 30 వ తేదీ వరకు చేపటట్టిన ఈ బోధన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నాడు కురబలకోట గ్రంథాలయంలో విద్యార్థిని, విద్యార్థులకు వేసవి తరగతులు నిర్వహించారు. ప్రతిరోజు సెలవుల్లో విద్యార్థిని విద్యార్థులు కొంత సమయాన్ని పాటిస్తే తమ మేధస్సును పెంపొందించుకోవచ్చునన్నారు అన్నారు.