ఓ విద్యార్థి స్ట్రెచర్ పై పడుకునే పరీక్ష రాసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరునెల్వేలిలోని పెట్టైలో ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా అజారుద్దీన్ అనే విద్యార్థి పరీక్ష హాల్ కు స్ట్రెచర్ పై వచ్చి పరీక్ష రాశాడు. అజారుద్దీన్ ఈ మధ్యనే ఓ ప్రమాదంలో గాయపడటంతో పాళయంకొట్టై ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అతడికి చికిత్స చేశారు. కాలుకు పెద్ద గాయం అవ్వడంతో కట్టు కట్టి కదలకుండా విశ్రాంతి తీసుకోమని చెప్పారు.
ఇటువంటి స్థితిలో ఉన్నప్పటికీ పరీక్షలు మానడం అజారుద్దీన్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. అంబులెన్స్‌లోనే పరీక్ష కేంద్రానికి చేరుకుని ఉపాధ్యాయులతో మాట్లాడి స్ట్రెచర్‌పై పడుకుని పరీక్ష రాశాదు. అతను అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ పరీక్ష రాయడంతో అందరూ అతనిని మెచ్చుకుంటున్నారు.