మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో కాంచన గుహాలో వెలిసిన శ్రీ కురుమూర్తి స్వామి వారి హుండి బుధవారం లెక్కించగా ఆదాయం రూ. 3, 43, 809లు వచ్చిందని ఈఓ సారా శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. హుండీ లెక్కింపులో దేవస్థాన చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కమిటీ సభ్యులు శంకర్, వెంకటే శ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అర్చకులు వెంకటేశ్వర ఆచార్యులు, సత్యనారాయణ, వెంకటయ్య, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.