పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామ శివారులో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు ఉదయం నుంచి ప్రత్యేకంగా అభిషేకం, అర్చనలు చేసి మంగళ హారతి ఇచ్చారు. ఆలయంలో భక్తులు కొవిడ్ - 19 నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటున్నారు.