ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో నలుగురుకి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 09:25 AM

గుత్తి మండల పరిధిలోని వన్నేదొడ్డి గ్రామ సమీపంలోని 44 వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో షణ్ముఖ అను వ్యక్తి తోపాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa