ధాన్యం కొనుగోలు విషయంలో , దళారులు , రైతులను మోసం చేసారని, చాల పెద్ద స్కామ్ జరిగింది అని నిన్న వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ.... ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్ అని వైసీపీ పార్టీ ఎంపీ బోస్ గారు చెప్పింది అక్షరసత్యం. కోనసీమలోనే కాదు నెల్లూరులోనూ బస్తాకు రూ.300కు పైగా దోచేశారు.వైసీపీ నేతలు,దళారులు,మిల్లర్లు కుమ్మక్కై రైతుల పుట్టి ముంచేశారు. మూడేళ్ల జగన్ పాలనలో ఒక్క నెల్లూరులోనే 3 వేల కోట్లు దోచుకున్నారు. ఈ భారీ స్కామ్ పై సీఐడీ కాదు సీబీఐ లేదా జ్యుడిషియల్ ఎంక్వయిరీ జరిపితేనే నిజాలు నిగ్గుతేలుతాయి అని తెలియచేసారు.