యూపీలోని ఉన్నావ్ లో బీజేపీ ఎమ్మెల్యే అశుతోశ్ శుక్లా బంధువులు వేధించడం వల్ల ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పోలీస్ స్టేషన్ లోనే వెక్కివెక్కి ఏడ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సైరన్ లతో వెళ్తున్న వాహనాలను అడ్డగించి, ఫొటోలు తీయాలని ఆ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. దీంతో మా వాహనాలనే అడ్డగిస్తావా అంటూ ఎమ్మెల్యే బంధువులు కానిస్టేబుల్ తో గొడవపడ్డారు. కానిస్టేబుల్ ను స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఏడుస్తూ కనిపించారు. పక్కన ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్రను పోషించారు. ఈ వీడియో వైరల్ అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులెవరూ స్పందించకపోవడం గమనార్హం.