ప్రతిష్టాత్మక ఐఐఎం అహ్మదాబాద్ లో అడ్మిషన్ కు ఎంపికైన శ్రీకాకుళం జిల్లా అమ్మాయి బొడ్డేపల్లి మానస.పలాస మండలం చిన్నబడాం దరి రాజపురానికి చెందిన బొడ్డేపల్లి మానస (21) దేశంలోనే అత్యున్నతమైన మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అహ్మదాబాద్‌లో ఎంబీఏ చదువుటకు ఎంపికయ్యారు. మానస తండ్రి బొడ్డేపల్లి తులసీరావు విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. తల్లి సౌజన్య గృహిణి. మానస తన ఇంజినీరింగ్ విద్యను ఎన్ ఐ టి తిరుచిరాపల్లిలో అభ్యసించి నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో అత్యున్నత ప్రతిభ కనబరిచి క్యాంపస్‌లోని ప్రథమ స్థానంలో నిలిచారు. మొదటి ప్రయత్నంలోనే మానస విజయం పట్ల తల్లిదండ్రులు బంధువులు శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తపరిచారు.