ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తాగునీరు చాలా ప్రధానమని, అధికారులు తాగునీటి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు విజ్ఞప్తి చేయడం జరిగింది. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రాయపాడు పంచాయతీ పరిథిలోని శాంతి నగర్ వద్ద ఉన్న మంచినీటి రిజర్వాయర్ ను పరిశీలించి, రిజర్వాయర్ పరిస్థితిని చూసి, ప్లాస్టిక్ పదార్థాలు, పిచ్చి మొక్కలతో చెరువుగట్టు పేరుకుపోయింది.శుభ్రపరచలేని పరిస్థితిలో అధికారులు ఉండటం చాలా బాధాకరం అని ఆయన అన్నారు. నరసరావుపేట మంచి నీటికి మంచి పేరు ఉందని గుర్తు చేసి, ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలి, లేనిపక్షంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులను హెచ్చరించడం జరిగింది.