అపరాజిత పువ్వుల గురించి చాలా మందికి తెలీదు. నీలం, తెలుపు రంగులో ఉండే ఈ పూల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వందకు పైగా జబ్బులను, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని ఈ పూలు తగ్గిస్తాయి. బ్లూ కలర్ లో ఉండే ఈ అపరాజిత పువ్వులు చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. వీటిని శంఖుపుష్పాలు అని కూడా పిలుస్తారు. ఈ పూలను ఆయుర్వేదంలో చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఈ పూలు యాంటీఆక్సిడెంట్ మూలకాలను కలిగి ఉన్నాయి. ఈ పూలు ఆందోళన, ఒత్తిడి నుండి మలబద్ధకం వరకు అన్ని సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి.
అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఈ పూలు రక్షించడంలో సహాయపడతాయి. ఈ పూలసారంతో టీ తాగితే వాపు, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తిని ఈ పూలు పెంచుతాయి. ఈ పూలతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లతో అవి పోరాడుతాయి. అపరాజిత పుష్పం సారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు కణాలు ఏర్పడటం నెమ్మదిగా జరిగి దాని కారణంగా బరువు అనేది పెరగదు. పేగులను ఈ పూలు ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణవ్యవస్థను ఈ పూలు శక్తివంతం చేస్తాయి.