ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారికే కాదు, కాలుష్యంలో తిరిగేవారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు పొంచి ఉంటాయి. ఊపిరితిత్తులు విష వ్యర్థాలతో నిండిపోవడంతో అనేక సమస్యలు వస్తాయి. అయితే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే పరిగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. అలా చేస్తే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. నిమ్మరసానికి బదులుగా పైనాపిల్, క్రాన్‌బెర్రీ జ్యూస్ లను కూడా తీసుకోవచ్చు.
- పరిగడుపునే 1 లేదా 2 టీ స్పూన్ల అల్లం రసం తాగినా ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.
- ఉదయాన్నే 3 నుంచి 5 పుదీనా ఆకులను నమిలి తినాలి. అలా చేస్తే ఊపిరితిత్తులకు బలం కలుగుతుంది. అంతేకాకుండా శుభ్రంగా మారుతాయి.
- రోజూ ఉదయాన్నే ప్రాణాయామం చేయడం వల్ల కూడా ఊపిరితిత్తులను శుభ్రంగా మార్చుకోవచ్చు.
- గోరు వెచ్చని నీటిలో 5 నుంచి 10 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి అనంతరం వచ్చే ఆవిరిని పీల్చాలి. అలా చేస్తే ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
- ఛాతిపై నిత్యం ఆముదాన్ని మర్దనా చేయాలి. అలా చేస్తే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.