సరైన రీతిలో శరీరానికి శక్తిని అందిస్తేనే తిన్న ఆహారానికి ఓ ప్రయోజనం ఉంటుంది. అయితే అలా ప్రయోజనం చేకూరాలంటే భోజనం చేశాక కొన్ని పనులు చేయకూడదు అంటున్నారు నిపుణులు. భోజనం తర్వాత ఓ గంటసేపు ఏం చేయకూడదు అనే అంశంపై చేపట్టిన పలు అధ్యయనాల్లో ఆసక్తికర అంశాలు వెల్లడి అయ్యాయి. అవేంటో చూద్దాం.
*భోజనం చేసిన వెంటనే నిద్ర పోకూడదు. ఇలా చేయడం వల్ల బరువు పెరుగుతారు.
*చాలామంది భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తుంటారు. ఇలా చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో పాటు గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.
*ఒకవేళ స్నానం చేయాలని భావిస్తే భోజనం చేసిన ఓ గంట తర్వాత చేయండి.
*భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయకూడదు.
*అన్నం తిన్నాక వెంటనే ఫ్రూట్స్ కూడా తీసుకోవద్దు. తిన్న ఆహారంలోని పోషకాలు శరీరం గ్రహించడానికి కాస్త సమయం కావాలి. ఆ లోపు పండ్లను తీసుకుంటే ఆ పోషకాల్ని కోల్పోతాం.
*అన్నం తిన్న వెంటనే టీ, కాఫీలు తాగకూడదు.
*భోజనం అయిన వెంటనే కూర్చోకుండా మెల్లిగా కాసేపు అటూ ఇటూ నడవాలి.