రాష్ట్రంలో ప్రతీ గడపకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎదో ఒక పథకం అందుతుంది అని స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. గురువారం మండలంలోని కారాడ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం ప్రతీ ఇంటిఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు అమలు తీరును అరా తీశారు. ప్రతీ గడపలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.
తమకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వాలంటీర్లు ద్వారా సక్రమంగా అందుతున్నాయని అవ్వ, తాతలు, చెప్పడంతో ఎమ్మెల్యే శంబంగి హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో స్థానికులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ప్రభుత్వ సహకారంతో వాటిని పరుష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన ప్రభుత్వ సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంబంగి లక్ష్మీ, జడ్పీటీసీ సంకిలి శాంతకుమారి, మండల పార్టీ అధ్యక్షులు శంబంగి వేణుగోపాలనాయుడు, ఎమ్మెల్యే తనయుడు శంబంగి శ్రీకాంత్, వైస్ ఎంపీపీ అరసాడ శంకర్రావు, డొకల జ్యోతి, సర్పంచ్ చొక్కాపు సరస్వతి, ఎంపీడీఓ చంద్రమ్మ, తహశీల్దార్ రామస్వామి, డాక్టర్ బొత్స కాశినాయుడు, పిఎసిఎస్ అధ్యక్షుడు రాజగోపాల్ నాయుడు, వాకాడ త్రినాధ, బొద్దల సత్యనారాయణ, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.