రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించడానికి ఎప్పుడూ సిద్ధమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. 22 ఎంపీలు గెలిపించారు.. మరి జగన్ ప్రత్యేక హోదా తెచ్చారా అని ప్రశ్నించారు. జగన్ రాజ్యసభ అమ్ముకున్నారు.. ఏ2ను సరిగా చూసుకోకపోతే.. ఏ1 ఔట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ భయంతోనే ఏ2కు జగన్ రాజ్యసభ ఇచ్చారని.. కేసులు వాదించే వారికి రాజ్యసభ.. ముంబై లాబీయింగ్ చేసే వారికి రాజ్యసభ ఇచ్చారన్నారు. మూడేళ్లలో ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చిందా.. ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా అంటూ ప్రశ్నించారు.
కర్నూలును ఇండస్ట్రీ హబ్ చేయాలని టీడీపీ హయాంలో కంపెనీలను తెచ్చామన్నారు. కర్నూలుకు ఎయిర్‌పోర్ట్ కూడా గత ప్రభుత్వ హయాంలోనే వచ్చిందన్నారు. గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులు ఏమయ్యాయి.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమయ్యిందని ప్రశ్నించారు. గడప గడపలో నేతలను జనం ప్రశ్నిస్తుంటే.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర అంటోందన్నారు. భవిష్యత్‌లో ఇక గాలి యాత్ర చేస్తారేమో అంటూ సెటైర్లు పేల్చారు.