ఆంధ్రప్రదేశ్ లో టమాటా ధరలు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కిలో టమోటా వందకు చేరుకోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పంట దిగుబడి తగ్గడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు లేకపోవడంతో ఏపీలో టమాట ధరలు భారీగా పెరిగాయి.ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం టమాటను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతుబజార్లలో సరసమైన ధరలకు టమాటా విక్రయిస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి తెలిపారు. ఏపీలోని అన్ని రైతు బజార్ల ద్వారా టమాటా సరసమైన ధరలకు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గోవర్ధనరెడ్డి తెలిపారు.