ఎందుకంటే గాడిదలను కాస్తూ ఓ వ్యక్తి లక్షలు సంపాదిస్తున్నాడు. లీటర్ గాడిద పాలను రూ.7000లకు అమ్ముతున్నాడు. దాంతో ఆ వ్యాపారం లాభాల్లో నడుస్తుంది.
గాడిద పాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వాటిని సబ్బలు, లోషన్లు, రకరకాల క్రీముల్లో వాడుతుంటారు. దీంతో దేశవ్యాప్తంగా గాడిద పాలకు ఎంతో డిమాండ్ ఉంది. తమిళనాడుకు చెందిన యూఎస్ బాబు... ఆవు, గేదె, మేక లాంటి జంతువులను పెంచినట్టే ఇప్పుడు గాడిదలను పెంచుతూ మంచి వ్యాపారవేత్తగా ఎదిగాడు. గ్రాడ్యుయేషన్ చేసిన బాబు మరెంతోమందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉన్నాడు.
వన్నారపేటకు చెందిన బాబు తమిళనాడులోని తిరునల్వేలిలో తొలి గాడిద ఫామ్‌ను స్థాపించాడు. గాడిదల పాలను బెంగళూరులోని ఓ కాస్మెటిక్ ఉత్పత్తుల కంపెనీకి సరఫరా చేస్తున్నాడు. లీటరు రూ.7 వేలకు విక్రయిస్తున్నాడు. బాబు కొంతకాలం ఫార్మా కంపెనీలో పని చేశాడు. అదే సమయంలో కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ ప్రతి నెలా వెయ్యి లీటర్ల గాడిద పాలను సరఫరా చేయగల వారి కోసం వెదుకుతున్నట్టు బాబు తెలుసుకున్నాడు. అయితే తమిళనాడులో మొత్తం రెండు వేల గాడిదలు మాత్రమే ఉన్నాయని, ఒక గాడిద రోజుకు 350 మిల్లీలీటర్ల పాలు మాత్రమే ఇస్తుందని బాబు తెలుసుకున్నాడు.
వెంటనే తానే సొంతంగా గాడిద ఫామ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తన ఆలోచనను కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ వారెవరూ అంగీకరించలేదు. అయినా సరే బాబు తన ప్రయత్నాలను ఆపలేదు. 17 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, నెలయ్ జిల్లాలో వంద గాడిదలతో డాంకీ ప్యాలెస్ పేరుతో ఫామ్‌ను ఏర్పాటు చేశాడు. మే 14వ తేదీన జిల్లా కలెక్టర్ విష్ణు ఆ ఫామ్‌ను ప్రారంభించారు. ఈ ఫామ్‌లో మూడు రకాల గాడిదలున్నాయి. ఈ గాడిదల పెంపకంపై బాబు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వాటికి మేత పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.