తాడికొండ సర్పంచ్ తోకల సరోజినీ కారు పై గురువారం రాత్రి సమయంలో రాళ్ల దాడి జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. రోడ్డుపై నిలిపి ఉంచిన కారుపై రాళ్ల తో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. దుండగులు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ చేపట్టారు.