ఈనెల 18న నాటు సారా తయారు చేస్తున్న కేసులో అరెస్టైన మహిళ భర్త రమేష్, వీరికి నల్లబెల్లం విక్రయిస్తున్న లక్ష్మి విశ్వనాథరావును అరెస్టు చేసినట్లు రేపల్లె పట్టణ సీఐ సూర్యనారాయణ తెలిపారు. రేపల్లె పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చట్టవ్యతిరేక కార్యక్రమాలపై నిఘా పెట్టమన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. గ్రామాలలో ఎవరైనా నాటుసారా తయారు చేసిన తయారీదారులకు ముడిసరుకులు అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారి వివరాలు తన సెల్ నెంబర్ 9440796169 కు కాల్ చేసి తెలియజేయాలని వివరాలు అందించిన వారు పేర్లు గోప్యంగా ఉంచుతామని సిఐ తెలిపారు. సమావేశంలో రేపల్లె పట్టణ ఎస్ఐ అబ్దుల్ రజాక్, సిబ్బంది పాల్గొన్నారు.