అవుకు మండల పరిధిలోని శివవరం గ్రామ నమీపంలో ఉన్న గొల్లలేరు వాగులో యువకుడు గల్లంతైన ఘటన గురువారం చోటు చేసుకుంది. శివవరం గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి, పెద్దక్కల కుమారుడు గోపిరెడ్డి శ్రీనివాన రెడ్డి (28) రోజూ మాదిరే గేదెలను మేపడానికి పొలాల్లోకి తీసుకెళ్లాడు. పాలాల సమీపంలోని గొల్లలేరు వాగులో నీరు తాగటానికి వెళ్లిన నాలుగు గేదెలు ప్రమాదవశాత్తు అందులో పడ్డాయి. వాటిని పైకి తీసుకురావటానికి వాగులోకి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి దిగాడు. ఒక గేదెను పైకి తీసుకొచ్చి మరో గేదెను పైకి తీసుకురావటానికి ప్రయత్నిస్తుండగా గుర్రపుడెక్కల మధ్యలో ఇరుక్కుపోయాడు. అతనితో పాటు మూడు గేదెలు కూడా వాగులో మునిగిపోయాయి. పక్కనున్న వారు గ్రామస్తులకు సమాచారం అందించటంతో హిటాచీ సహాయంతో గుగర్రపుడెక్కాలను తొలగించి వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు యువకుడి ఆచూకి తెలియలేదని గ్రామస్తులు తెలిపారు.