ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఉమ్మడి కుటుంబం అందరికీ ఆదర్శం

national |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 11:52 AM

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా కనిపించడం లేదు. ఒక ఇంట్లో ఐదారుగురు సభ్యులు ఉంటేనే ఎన్నో సమస్యలు, మనస్పర్థలు వస్తున్నాయి. కుటుంబ నిర్వహణ కూడా భారంగా మారుతోంది. కానీ బీహార్​ లో ఓ ఉమ్మడి కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఒకే ఇంట్లో ఏకంగా 62 మంది కలిసి జీవిస్తున్నారు. ఎలాంటి గొడవలు, సమస్యలు లేకాండా ఉంటున్నారు.


బీహార్ రాష్ట్రంలోని బోధ్​గయాకు చెందిన ఈ కుటుంబాన్ని కల్యాణ్ కుటుంబం అని పిలుస్తారు. ఈ ఇంటికి కృష్ణ కన్నయ్య ప్రసాద్, రాధికా దేవి​ పెద్దలు. ఈ కుటుంబం విడిపోకుండా వీరే చూసుకుంటున్నారు. మొత్తం 62 మంది ఉండే ఈ ఇంట్లో 57 గదులు ఉంటాయి. దాదాపు అందరికీ ప్రత్యేక గదులు ఉన్నాయి. ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కల్యాణ్ పరివార్​ కాంప్లెక్స్ అంటారు. అయితే ఇంత మందికి కలిపి ఒకే కిచెన్ ఉంటుంది. అందరూ ఒకేసారి భోజనం చేస్తారు. ఈ ఫ్యామిలీలో 9 మంది అన్నదమ్ములు ఉన్నారు.


ఈ కుటుంబంలో మొత్తం 6 తరాలు ఉండగా, ప్రస్తుతం 4 తరాల వారు ఈ ఇంట్లో ఉన్నారు. అందరికంటే పెద్ద కృష్ణ కన్నయ్య ప్రసాద్. పదేళ్ల చమి కల్యాణ్​ అనే పాప అతి చిన్న వయస్కురాలు. తమ కుటుంబంలో కజిన్స్ ​తో కలిపి మొత్తం 9 మంది అన్నదమ్ములని వివేక్ కల్యాణ్ సింగ్ తెలిపారు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారని, అందరికీ పెళ్లిళ్లు అయ్యాయని తెలిపారు. ఇంట్లో మొత్తం 21 మంది పిల్లలు ఉన్నారని వెల్లడించారు. ఈ ఉమ్మడి కుటుంబం 5 ఎన్జీఓల సాయంతో తమ ప్రాంతంలోని పేదలకు సాయం చేస్తున్నారు. ఈ ఇంట్లో ఉన్న అన్నాదమ్ములందరికీ వ్యాపారాలున్నాయి. హోటల్స్, హార్డ్​ వేర్, శానిటరీ ఐటెమ్స్, టైల్స్-మార్బుల్స్, భవన నిర్మాణ వస్తువులు, ఎలక్ట్రిక్ వస్తువులు వంటి భిన్న రకాల వ్యాపారాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com