ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఉన్న రైతులకు అలర్ట్. పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme) 11వ ఇన్స్టాల్మెంట్ త్వరలో రిలీజ్ కానుంది. అయితే ఈసారి E-KYC చేయించుకున్న రైతులకు మాత్రమే 11వ ఇన్స్టాల్మెంట్ (11th Installment) లభిస్తుంది. రైతులు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లాలి. అక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. రైతులు కామన్ సర్వీస్ సెంటర్లో 2022 మే 31 లోగా ఈ-కేవైసీ చేయించాలి. అంటే గడువు మరో మూడు వారాలు మాత్రమే ఉంది.