కాకినాడలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కారులో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. దీంతో అతని మృతదేహాన్ని తరలించకుండా బంధువులు అడ్డుకున్నారు. సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఉదయ్ భాస్కర్ వద్ద సుబ్రహ్మణ్యం 5ఏళ్ల నుంచి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల డ్రైవర్ గా పని మానేశాడు. ఏదో మాట్లాడాలని పిలిచి గురువారం రాత్రి 10.30కి తీసుకెళ్లి 1.30కి ఇంటికి శవాన్ని తీసుకొచ్చారని మృతుని తల్లి తెలిపారు. ఇది ముమ్మాటికి హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీకి తాము రూ.20వేలు బాకీ ఉన్నామని దాని విషయంలో గతంలో ఆయన హెచ్చరించాడని అన్నారు. ఎమ్మెల్సీనే కొట్టి చంపారని వారు ఆరోపిస్తున్నారు.