తిరుపతి నగర పరిధిలోని బందరి కాలనీ, రాయల్ నగర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 30 ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న ఇల్లును ఇక్కడ ప్రజా ప్రతినిధులు కబ్జా చేస్తున్నారని మహిళలు ఆందోళన దిగారు. తిరుపతి రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో కబ్జాలు చేస్తున్నారని మహిళలు అడ్డుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను అధికారులు కూలుస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి ఆదేశాలతో కార్పొరేటర్ సహకారంతో కబ్జాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.