చాలా మందికి తరచుగా తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
తలనొప్పి తగ్గడానికి క్యారెట్, కీరా జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది
తలనొప్పి ఎక్కువగా ఉంటే లెమన్ జ్యూస్ ను తీసుకుంటే చాలా మంచిది.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు వేసుకుని తీసుకుంటే వెంటనే తల నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది.
తల నొప్పిని తగ్గించడానికి అరటిపండు, పైనాపిల్ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే బాగా నిద్రపోవడం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది.
ఫోన్, టీవీలు చూడటం తగ్గించడం ద్వాారా తలనొప్పిని నివారించవచ్చు.
ఓ కప్పు టీ కూడా తలనొప్పిని తరిమికొడుతుంది.
కొబ్బరినూనెతో తలను మసాజ్ చేసుకోవడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.