అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మలిగివారి పల్లెలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్ ఈ ఓ వెంకటరమణ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ముందు జాగ్రత్తలు తప్పనిసరి గా పాటించాలన్నారు.
జలుబు, దగ్గు, అతిసారం తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు. ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తల ను సూచించారు. ఇంటి పరిసరాల శుభ్రతతో పాటు , వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు