పసుపు, పాలు ఇవి రెండు ఆరోగ్యానికి మంచి చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పాలకు కొద్దిగా పసుపు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజు క్రమం తప్పకుండా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్య నుంచి బయట పడొచ్చని చెబుతున్నారు.
- పసుపు, పాలను కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబుతో భాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శ్వాసకోశ వ్యాధులను దూరం చేస్తుంది.
- పసుపు పాలు ప్రతిరోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కఫము ఎక్కువుగా ఉన్నప్పుడు గోరు వెచ్చని పసుపు పాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
- పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి.
- కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను రోజూ తీసుకోవాలి.
- తరచుగా పసుపు కలిపిన పాలు తాగితే కామెర్లు రాకుండా చేస్తాయి. మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను కూడా తగ్గిస్తాయి.