తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం విఐపిల విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి , తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి స్వామివారి సేవలో వేరువేరుగా పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వామి వారి దర్శనంతరం తీర్థప్రసాదాలను, వేద ఆశీర్వచనాలు అందించారు.