తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా గోపరాజుపల్లికి చెందిన జనసేన పార్టీ క్రియా శీలక సభ్యుడు శ్రీ కొంగరి సైదులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ సైదులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని భార్య శ్రీ సుమతిని ఓదార్చారు. శ్రీ సైదులు కుమారుడు కూడా ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బిడ్డల చదువు, ఆరోగ్యం బాధ్యతను కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.