పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రావెల సత్యనారాయణ టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్నారు. సభ్యత్వం తో పాటు పార్టీ కోసం 5 లక్షల 1,116 రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. ఈయన రాకతో నరసరావుపేటలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయని తెలుస్తుంది. ఈ విష్యంపై టీడీపీ అధినేత చంద్ర బాబు మాట్లాడుతూ... ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలపై పోరాడేందుకు... సమాజానికి ఉత్తమ రాజకీయాలను అందించేందుకు తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు, సహకారం అవసరం. అందుకే ప్రజల నుంచి స్వచ్ఛంద విరాళాలకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుకు స్పందించి పార్టీకి తమ విరాళాలు అందించిన మీకు ధన్యవాదాలు అని తెలియజేసారు.