గుంటూరు లోని డాక్టర్ లక్ష్మణ స్వామి హాస్పిటల్ లో మాజీ మంత్రి, దళిత నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జే.ఆర్ పుష్పరాజుని టీడీపీ నాయకులూ యరపతినేని శ్రీనివాసరావు కలిసి ఆరోగ్య పరిస్థితిపై పరామర్శించడం జరిగింది. కోవిడ్ బారినపడి గత కొన్ని నెలలుగా తీవ్ర అస్వస్థతకు గురై తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడి అన్నిరకాలుగా బాధపడుతున్న పుష్పరాజు ని గతంలో రెండు నెలల క్రితం కూడా కలిసి ఒక రూ.లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి యధావిధిగా అడుగుపెట్టాలని ఆయన ఆకాంక్షించారు.