గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం లోని ఐలాండ్ సెంటర్ లోని విజయ గణేష్ లాడ్జిలో వ్యభిచారం గుట్టుగా జరుగుతుందన్న సమాచారంతో పొన్నూరు అర్బన్ పోలీసులు లాడ్జి పై మెరుపు దాడి చేశారు. దాడిలో నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పొన్నూరు అర్బన్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని అర్బన్ సిఐ. శరత్ బాబు తెలిపారు.
పొన్నూరు పట్టణం లోని ఐదు లాడ్జిలు ఉండగా ప్రతి లాడ్జిలో గుట్టుగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం. పొన్నూరు, తెనాలి, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి యువతులను పొన్నూరు కు తరలించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటువంటి కార్యకలాపాలు ను కట్టడి చేయాలని ఆ ప్రాంత వ్యాపారులు కోరుతున్నారు.