గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం జిబిసి రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పొన్నూరు డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు గుంటూరు వైపు నుండి పొన్నూరు వస్తుండగా జిబిసి రోడ్డు నమస్తే బోర్డు సమీపంలో ఎదురుగా వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆటోను తప్పించబోయి బస్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనకనే వస్తున్న చీరాల డిపోకు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఇరు బస్సు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.