కుమార్తె షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, మీడియా మాజీ దిగ్గజం ఇంద్రాణి ముఖర్జీకి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఆరేళ్ల తర్వాత శుక్రవారం బైకుల్లా మహిళలు జైలు నుంచి విడుదలయ్యారు. 2 లక్షల నగదు బాండ్ అందించడంతో అధికారులు ఆమెను విడుదల చేశారు. అన్ని ఫార్మాలిటీలు పాటించామని ముఖర్జీ తరపు న్యాయవాది తెలిపారు. సుప్రీంకోర్టు బుధవారం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇంద్రాణి ముఖర్జీ చాలా కాలంగా జైలులో ఉన్నారని, విచారణ త్వరగా ముగిసే అవకాశం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.