ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. టెన్ జనపథ్ లోని సోనియా ఇంటికి చేరుకున్న కిరణ్ 45 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపైనే ప్రధానంగా చర్చ జరిగింది.ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన చింతన్ శిబిర్లో పార్టీ నుంచి పదవులు అనుభవించిన నాయకులు పార్టీ బలోపేతానికి పాటుపడాలని ఇటీవల సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయింది.ఈ తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధినేతకు దగ్గర చేయడంలో ఆ పార్టీ నేతలు కొందరు కీలక పాత్ర పోషించారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.