రైల్వే క్వార్టర్స్ లో ఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవలే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ దామిరాజు పిడుగురాళ్ల పట్టణం లోని రైల్వే క్వార్టర్స్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత తల్లితో కలిసి ఉంటున్నాడు. దామిరాజు ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని రైల్వే పోలీసులు భావిస్తున్నార. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.