ఈఏడాది ముందుగానే తొలకరి వర్షాలు పలకరించడంతో మండల పరిధిలోని జొన్నగిరి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా వజ్రాల కోసం వేట మొదలెయింది. ఈసారి ఎలాగైన తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి చాలా మంది తమ కుటుంబ సభ్యులతో ఒకేసారి తమకు కావలసిన భోజనాలను కూడా సిద్ధం చేసుకుని వజ్రాల వేటకు ఏకంగా కార్లు, ఆటోలు, టూవీలర్ల ద్వారా ఇక్కడికి చేరుకుని ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇక్కడే ఉంటూ అవసరమైతే రాత్రి కూడా ఇక్కడే బస చేస్తూ కొంతమంది ఉద్యోగస్తులు సైతం వజ్రాలను వెదికే పనిలో పడ్డారు.