మండల కేంద్రమైన చిప్పగిరిలో వెలసిన భంభం స్వామి ఉరుసు మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవంలో భాగంగా శుక్రవారం వేకువజామున దర్గా పీఠాధిపతి సయ్యద్ ఆరిపద్దీన్ ఖాద్రీ ఆధ్వర్యంలో స్వామివారి ప్రతిమను అశ్వంపై ప్రతిష్టించి గ్రామంలోని పలు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచే గాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. దర్గా దగ్గర భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. జడ్పిటిసి విరుపాక్షి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.