ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులతో విత్తనాలు, ఎరువుల దుకాణాలు కిటకిటలాడుతున్నాయిఆ. ఆదోని డివిజన్లోని రైతులే కాకుండా కర్నాటకకు చెందిన రైతులు పత్తి విత్తనాల కోసం భారీగా తరలివచ్చారు. దుకాణాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు. కర్నాటకలోని షాపూరు, శిరుగుప్ప, సింధనూరు, రాయచూరు ప్రాంతాల రైతులు ఆదోనికి వచ్చి పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.