అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులో పెళ్లికి వెళుతున్న వధువు కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. విడపనకల్లు మండలం పెంచులపాడుకు చెందిన ఇందు వివాహం ఉండబండ దేవాలయంలో జరుగుతుండగా, చాబాల మీదుగా ఉండబండకు కారులో వెళుతుండగా రాత్రి హంద్రీనీవా పిల్ల కాలువలోకి నేరుగా కారు దూసుకెళ్లింది. శంకరమ్మ అనే హిజ్రా, వన్నూరప్పకు స్వల్ప గాయాలయ్యాయి. వధువుకు ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరో వాహనంలో పెళ్లి వేదికకు వధువును తీసుకెళ్లారు. సరైన ప్రమాద హెచ్చరికలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు బాధితులు తెలిపారు.