శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని మేకలపల్లి గ్రామంలో అక్కమ్మ (70) అనే వృద్ధురాలు ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రిచోటు చేసుకుంది. గ్రామంలో తన కుమారుడు అశ్వర్థనివాసంలో ఆమె జీవనం సాగిస్తోంది. ఇంటిలో ఎవరూలేని సమయంలో పై కప్పుకు చీరతో మెడకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అంతలోనే వచ్చినకుమారుడు ఆమెను చిందకు దించి ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నించగా అప్పటికే మృతిచెందింది. ఆత్మహత్యకు గలకారణాలు పోలీసుల దర్యాప్తులో తేలియాల్సి ఉంది.