ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యమైన గుండె కోసం 5 సూత్రాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 11:50 AM

శరీరంలోని ప్రధాన అవయవాలలో గుండె ఒకటి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే గుండె జబ్బులను నివారించవచ్చు. ఆరోగ్యవంతమైన గుండె కోసం 5 సూత్రాలు పాటిస్తే చాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మానసిక ఆరోగ్యంపై అప్రమత్తత: ప్రతి ఒక్కరు మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీకు మనసు బాగా లేనప్పుడు నచ్చిన ప్రదేశాలకు వెళ్లండి. విటమిన్లు, పోషకాలను కోల్పోకుండా వైద్యుడిని సంప్రదించండి. ప్రతిరోజు యోగా, ధ్యానం చేయండి.
2. ఆహారంలో ఉప్పు నియంత్రణ: ఆరోగ్యకరమైన గుండె కోసం మీరు సాధారణ బీపీని కలిగి ఉండాలి. ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది మీ రక్తపోటును సాధారణం కంటే పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ మీరు అదనపు ఉప్పును తీసుకోకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఊరగాయలు, పాపడ్‌ లు, ప్రిజర్వ్‌ లు, చిప్స్, పిజ్జాలు, చీజ్, పాశ్చరైజ్డ్ బటర్ మొదలైన వాటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. వీటిని తినడం మానేయాలి. ఇది మూత్రపిండాలకు కూడా హాని కలిగిస్తుంది.

3. మంచి నిద్ర: అసంపూర్ణమైన నిద్ర మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. రాత్రిపూట నిద్ర పట్టకపోతే పాలు తాగడం లాంటి హోమ్‌ రెమిడీస్ పాటించాలి. టీ, కాఫీలను తీసుకోకూడదు.
4. గుండెకి మేలు చేసే ఆహారం: హార్వర్డ్ అధ్యయనం ప్రకారం ప్రతిరోజు 2 పండ్లు, 3 కూరగాయలను డైట్‌ లో చేర్చుకుంటే ఎక్కువ కాలం జీవించవచ్చు. శాఖాహారంలో గుండెకి అవసరమయ్యే అన్ని పోషకాలు లభిస్తాయి. మాంసాహారంలో కొన్ని మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఇవి గుండెపై ఒత్తిడి పెంచుతాయి.
5. యాక్టివ్‌గా ఉండండి: మనిషి యాక్టివ్‌గా ఉన్నప్పుడు శరీరంలో అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం కచ్చితంగా చేయాలి. రోజు 10,000 అడుగులు నడవాలి. వారానికి మూడు నుంచి 5 సార్లు కనీసం 30 నిమిషాల మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి. ప్రతి గంటకు 5 నిమిషాల నడక తప్పనిసరి. ఒకేచోట ఎప్పుడు కూర్చొని పనిచేయకూడదు. ఇది గుండెజబ్బులకి కారణం అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com