ఏపీలో కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు కరెంట్ కోతలు లేవంటూ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో తన పర్యటనను ముగించుకుని శుక్రవారం రాత్రి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా కరెంట్ పోయింది. దీంతో సెల్ ఫోన్ వెలుగులో ప్రెస్ మీట్ కొనసాగించారు. పవన్‌తో పాటు జనసేన నేతలు, మీడియా ప్రతినిధులు కూడా సెల్ ఫోన్ లైటు వెలిగించారు. అలాగే మీడియా ప్రతినిధులతో చిరునవ్వుతో మాట్లాడారు. కరెంట్ కోతలకు తాజా పరిస్థితులే నిదర్శనం అంటూ జనసేన నేతలు ఆయా ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.