మద్యం రక్కసి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. రోజూ తాగి ఇంటికి రావొద్దని ప్రశ్నించిన కుమార్తెలపై ఆ కిరాతకుడు కర్కశంగా ప్రవర్తించాడు. కర్రతో తన ఇద్దరు కుమార్తెలతో దారుణంగా కొట్టి చంపాడు. తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని ఒరగడమ్ సమీపంలోని చిన్న మధురపాక్కంకు చెందిన నిందితుడు గోవిందరాజ్ దినసరి కూలీ. మద్యానికి బానిసైన గోవిందరాజ్ ఉద్యోగానికి సరిగా వెళ్లేవాడు కాదని, ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అతని భార్య కుటుంబాన్ని, పిల్లలను చూసుకుంటుందని పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మద్యం మత్తులో తండ్రి వేధింపులు భరించలేక 14 ఏళ్ల రెండో కుమార్తె గత నెలలో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.
ఆ తర్వాత కూడా గోవిందరాజులు రోజూ మద్యం సేవించి భార్యాపిల్లలతో గొడవ పడేవాడు. శుక్రవారం ఇద్దరు పిల్లలు నందిని (16), దీప (9) ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో గోవిందరాజ్ మత్తులో ఇంటికి వచ్చాడని, ఇద్దరు కుమార్తెలు తమ తండ్రితో గొడవపడి, తాగుడు మానేయాలని కోరారు. సహనం కోల్పోయిన గోవిందరాజులు చెక్క దుంగ తీసుకుని పిల్లలిద్దరినీ కొట్టి చంపాడు. కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని గోవిందరాజును పట్టుకుని ఒరగడాం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు చిన్నారుల మృతదేహాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.