ఉద్యోగి, యాజమాని మధ్య వర్క్ కాంట్రాక్ట్ రద్దు విషయమై సౌదీ అరేబియా మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది.ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60రోజుల నోటీస్ పీరియడ్ తప్పనిసరి అని మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉద్యోగి కాంట్రాక్ట్ వ్యవధి అపరిమితంగా ఉండి నెలవారీ వేతనం పొందినట్లైతే కనీసం రెండు నెలల ముందుగానే వర్క్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలనే ఉద్దేశాన్ని ఉద్యోగి తప్పనిసరిగా యజమానికి తెలియజేయాలని సూచించింది. ఉద్యోగి తన వేతనాన్ని నెలవారీగా పొందని సందర్భంలో 30 రోజుల కంటే తక్కువ వ్యవధిలో ఒప్పందం రద్దు గురించి యజమానికి తెలియజేసిన సరిపోతుందని పేర్కొంది. కాగా, కార్మికుడితో కాంట్రాక్టు సంబంధాన్ని రద్దు చేసుకుంటే యజమానికి కూడా ఇవే నియమాలు వర్తిస్తాయని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ తెలిపింది.
పరిహారం విషయంలో షరతులివే..
1) చట్టబద్ధమైన కారణంతో కాంట్రాక్టును రద్దు చేసిన సందర్భంలో పార్టీలో ఒకరు నోటీసు వ్యవధిని పాటించినట్లయితే, నోటీసు వ్యవధిలో కార్మికుడికి జీతానికి సమానమైన మెటీరియల్ పరిహారం బాధిత పార్టీకి చెల్లించబడుతుంది.
2) ఒకవేళ చట్టవిరుద్ధమైన కారణంతో కాంట్రాక్ట్ రద్దు చేయబడి, నిర్ధిష్ట పరిహారాన్ని కలిగి ఉండకపోతే కాంట్రాక్ట్ ఒప్పందం ప్రకారం మిగిలిన కాలానికి ఉద్యోగి వేతనాలపై అంచనా వేసిన మెటీరియల్ పరిహారం చెల్లించడం జరుగుతుంది.
3) పరిహారం రెండు నెలల వేతనం కంటే తక్కువగా ఉండకూడదు