రాయలసీమ రాగి సంగటి ఎంతో ఫేమస్ .. అయితే రాగులతో చేసిన అంబలి తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి రాగి అంబలి దివ్య ఔషధం వంటింది. దాని వల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. శరీరానికి కావల్సిన పోషకాలు రాగి అంబలి ద్వారా అందుతాయి. శారీరక శ్రమ చేసేవారికి రాగి అంబలి మంచి బలాన్ని ఇస్తుంది.
రాగి అంబలి పిల్లలకు మంచిది. మెదడు చురుగ్గా పనిచేసి.. చదువులో మంచి ప్రతిభను కనబరుస్తారు.
శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. చలువ చేస్తుంది.
రాగి అంబలి ఒక్క గ్లాస్ తాగినా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది
ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. స్థూలకాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బరువు తగ్గవచ్చు.
బీపీ, షుగర్ నియంత్రణలోకి వస్తాయి. రక్తస్రావం జరుగుతున్న వారికి రాగి అంబలి తాగిస్తే స్రావం ఆగిపోతుంది.
రాగి అంబలిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది.
ప్రతి రోజూ ఉదయం చేసే సాధారణ అల్పాహారానికి బదులుగా రాగి అంబలి తాగితే దాంతో మనం రోజంతా యాక్టివ్గా ఉండవచ్చు. శారీరక దృఢత్వం చేకూరుతుంది.